Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2024, 5:55 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

ఆర్మూర్, బతుకమ్మ :  డొంకశ్వర్ మండల కేంద్రం లో అంబేద్కర్ చౌరస్తా లో బీజేపీ ఆధ్వర్యంలో అర్ముర్ ఎం ఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. పైడి రాకేష్ రెడ్డి అర్ముర్ కు ఇంటిగ్రెటెడ్ స్కూల్ మంజూరు చేయించిన శుభ సందర్బంగా వారి చిత్రపటానికి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, మండల అధ్యక్షులు సురేందర్, సీనియర్ నాయకులు గంగాధర్, పోల్కం వేణు, తాళ్ల ముత్యం, రాజేశ్వర్, బుమన్న, నాగరాజు, నరేందర్, గంగారెడ్డి మురారి, సాయికుమార్, ప్రశాంత్, శక్తికేంద్ర ఇంచార్జ్ లు, బూతు అధ్యక్షులు పాలాభిషేకం చేశారు.కలిగొట గంగాధర్ మాట్లాడుతూ… ఈ ప్రాంతం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా విద్యార్థుల, తల్లి, తండ్రుల ఉపాధ్యాయుల విన్నపం మేరకు ప్రభుత్వ పాఠశాలలను, హాస్టల్ లను సందర్శించి వాటి బాగుకోసం & నా ప్రాంతం లో ఇంటిగ్రెటెడ్ పాఠశాల అవసరం ఉందని ముక్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి, మంత్రుల, అధికారుల చుట్టూ తిరుగుతూ ఒకటికి పదిసార్లు విన్నవించు కోవడం జరిగింది. అవసరం అయితే కొండంగల్ కు వచ్చి దీక్ష కూడ చేస్తా అని సిధాహం కావడం జరిగింది, ముఖ్య మంత్రి మీ ప్రాంత అభిరుద్ది తో పాటు మా ప్రాంతాన్ని కూడ అభివృద్ధి చెయ్యాలి అని ఎన్నో సార్లు కోరడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి,సంక్షేమం పై ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి చిత్త శుద్ధి తో పనిచేయడం అభినంచదగ్గ విషయం.