Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 7:09 pm Posted by : ramakrishna

సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం

బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ముత్యాల సునీల్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం చరిత్రలో ఎవరు ఆలోచన చేయని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిలేని నిరుపేదలకు ఏట 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. అభాగ్యులకు అండగా కాంగ్రెస్  ప్రభుత్వం ఉంటుందని తెలిపారు.