Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 2:11 pm Posted by : ramakrishna

తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులతో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం ఒంటెద్దు పోకడలకు నిదర్శమని బీఆర్ఎస్ ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆదిమూల సతీశ్ కుమార్ అన్నారు. పార్టీ పిలుపు మేరకు ఎల్లారెడ్డిలో తెలంగాణ తల్లి చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షుడు ఎగుల నర్సింలు, మున్సిపల్ సభ్యులు ఎరుకల సాయిలు, నాగం సురేందర్, అరవింద్ గౌడ్, నాగం రాజయ్య, మాజీ సర్పంచులు రవిగౌడ్, రఘువీర్ గౌడ్, సూతారి సాయిలు, గంగారెడ్డి, జగన్ గౌడ్, వసంతం, రవి, దయాకర్, నాగరాజు, రాము, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.