Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 January 2025, 5:40 pm Posted by : ramakrishna

ప్రధాని, ఎంపీ చిత్రపటాలకు పాలాభిషేకం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పసుపు బోర్డును ప్రకటించిన సందర్భంగా నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పుప్పాల నరేష్  మాట్లాడుతూ బిజెపి ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ప్రకటించిందని తెలిపారు. ఎన్నికలల్లో ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నిలబెట్టుకున్నారని తెలపారు. గతంలో నిజామాబాద్ సాక్షిగా అధికారికంగా ప్రకటించిన నరేంద్ర మోడీ సంక్రాంతి కానుకగా ఇవాళ రైతులకు పసుపు బోర్డు ప్రారంభించారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ చెప్పింది చేస్తది చేసేదే చెప్తది అనే దానికి పసుపు బోర్డు నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు ఏలేటి సాయన్న, జెడి గంగారెడ్డి, తీగల రమేష్ రెడ్డి, బీజీ గంగారం, కుంట శ్రీనివాస్, సంఘం అనిల్ కోరం ప్రకాష్, ఓల్లెం సంతోష్, గంగారెడ్డి, ఆప్కా మహిపాల్,  సాయికుమార్, శివానంద్, రాకేష్, సురేష్,  శివ తదితరులు పాల్గొన్నారు.