తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహంగా మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ తల్లికి అపచారం చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశామని తెలిపారు. మండల కేంద్రం తో పాటు ముచ్కూర్ తదితర గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేసిన నిరసన తెలిపారు....