తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

బోధన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఎంఎల్సీ కవిత ఆదేశాల మేరకు మంగళవారం భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బోధన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాలు చేశారు. ఈ సదర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అపచారానికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రజాక్, ఎస్సీ, ఎస్టీ జిల్లా సభ్యులు పెర్క...