Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 5:35 pm Posted by : ramakrishna

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

బోధన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఎంఎల్సీ కవిత ఆదేశాల మేరకు మంగళవారం భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బోధన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాలు చేశారు. ఈ సదర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అపచారానికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రజాక్, ఎస్సీ, ఎస్టీ జిల్లా సభ్యులు పెర్క రామకృష్ణ, కార్మిక విభాగం అధ్యక్షులు రవిశంకర్ గౌడ్, జమలం మాజీ సర్పంచ్ సాయిలు, సయ్యద్ హబీబ్, చిన్న మావంది బాడే రాజు, ఎస్సీ ఉపాధ్యక్షులు సాగర్, సుధాకర్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.