పక్కాగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బతుకమ్మ,మోర్తాడ్: ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో, వడ్యాట్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ గురువారం పరిశీలించారు. సర్వేయర్లు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించారు. మొబైల్ యాప్ లో నమోదు చేసిన వివరాలు దరఖాస్తుదారుల వాస్తవ వివరాలతో సరిపోయాయా లేదా అన్నది గమనించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, దరఖాస్తుదారుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ,...