Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2025, 12:31 pm Posted by : ramakrishna

పాక్ ముష్కరుల చొరబాటు యత్నం భగ్నం :  జవాన్ మృతి

వెబ్ న్యూస్,బతుకమ్మ :   జమ్మూక‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్ లో భారత్ సైన్యం పాక్ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడి మృతి చెందాడు. నియంత్రణ రేఖ  ఆర్మీ వ‌ర్గాల వివరాల ప్రకారం.. ఆగ‌స్టు 12వ తేదీ రాత్రి కొంద‌రు చొర‌బాటుకు ప్రయత్నించారు. అయితే రెగ్యుల‌ర్‌కు భిన్నంగా ఈ చొర‌బాటు సాగిన‌ట్లు తెలుస్తోంది. చొర‌బాటుదారుల‌కు అండ‌గా పాకిస్థాన్ ఆర్మీ ఫైరింగ్ జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. చొర‌బాటు జ‌రిగే స‌మ‌యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో  గాయ‌ప‌డ్డ జ‌వాను ఆ త‌ర్వాత ప్రాణాలు కోల్పోయాడు.