Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 4:30 pm Posted by : ramakrishna

విద్యుత్ షాక్ తో పెయింటర్ మృతి

 

భిక్కనూరు, బతుకమ్మ

 

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో ఒక నూతన ఇంటికి పెయింటింగ్ వేస్తున్న కామారెడ్డికి చెందిన పెయింటర్ 11 కేవీ వైరు తగిలి మృతి చెందాడు. ఈ సందర్భంగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో నూతన ఇంటికి పెయింటింగ్ వేస్తుండగా అజీజ్ అనే పెయింటర్ కి విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

 

Painter dies of electric shock