Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2024, 5:44 pm Posted by : ramakrishna

 పద్మశాలీలు అన్ని రంగాలలో రాణించాలి

  • …. టిఎస్ఎంఐడిసి చైర్మెన్ ఈరవత్రి అనిల్
  • బతుకమ్మ నిజామాబాద్ సిటీ…

తెలంగాణలో జనాభా దామాష పరంగా ఎక్కువ సంఖ్యలో పద్మశాలీలు ఉన్నప్పటికి వారికి అనుకున్నంతగా అవకాశాలు రాలేదని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే అవకాశాలు పెరిగాయని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. ఆదివారం వినాయక నగర్ లో పద్మశాలి సంఘం 19 వ తర్ప నూతన సంఘ భవన ప్రవేశానికి ఈరవత్రి అనిల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. చదువుతోపాటు, రాజకీయ, ఇతర ఉన్నతాధికారాల విషయంలో కూడా ముందుండి పద్మశాలీల సత్తా ఏంటో చూపెట్టాలని ఆయన కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పద్మశాలీలకు సరైన గుర్తింపు లభిస్తుందని  ఆయన అన్నారు. అయితే రాజకీయంగా వెనకబడి ఉన్న పద్మశాలీలు అన్నింట ముందుంది రాజకీయాల్లో కూడా సత్తా చాటాలన్నారు. గత ప్రభుత్వాలు పద్మశాలీలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఎన్నికల్లో అన్ని కులాలకు దీటుగా ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు సేవలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పద్మశాలి సంఘం తరఫున 19  కార్యవర్గ కమిటీ అధ్యక్షులు చింత శంకర్, ప్రధాన కార్యదర్శి గజ్జాల శంకర్,  పుట్ట వెంకటేశ్వర్తదితరులు పాల్గొన్నారు.