పద్మశాలి రాష్ట్ర కమిటీలో చోటు సాధించిన జిల్లా వాసులకు సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యవర్గంలో చోటు సాదించిన జిల్లాకు చెందిన పద్మశాలి నేతలకు జిల్లా పద్మశాలి మహిళా సంఘం ఆద్వర్యంలో శనివారం సన్మానకార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులైన జిల్లా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు, గౌరవ సలహాదారులుగా నియమితులైన రాష్ట్ర మహిళా సంఘం అద్యక్షురాలు గుజ్జ రాజేశ్వరిలకు జిల్లా పద్మశాలి సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో మహిళా సంఘం బాధ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా హన్మాండ్లు, రాజేశ్వరిలు మాట్లాడుతూ పద్మశాలీల...