Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 10:32 pm Posted by : ramakrishna

మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ

  • నిజామాబాద్ సభలో ఉండగానే ఫోన్ ద్వారా సమాచారం
  • నిజామాబాద్ గడ్డపై శుభవార్త రావడం సంతోషం

 

నిజామాబాద్, బతుకమ్మ : మందకృష్ణ మాదిగను పద్మశ్రీ వరించింది. నిజామాబాద్ విచ్చేసిన మందకృష్ణ మాదిగ నిజామాబాద్ సభలో ఉండగానే ఈ శుభవార్త రావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నిజామాబాద్ లో సభ నిర్వహించారు. ఫిబ్రవరి 7న  హైదరాబాదులో నిర్వహించే వెయ్యి గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక కార్యక్రమానికి మాదిగ సోదరులు తరలిరావాలని పిలుపునిచ్చారు. నిజామాబాదులో ఉన్న మాదిగ సంఘాల తరఫున శుభాకాంక్షలు తెలిపారు.