పద్మశ్రీ బండి రామకృష్ణారెడ్డి కన్నుమూత
హైదరాబాద్, బతుకమ్మ : ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య బండి రామకృష్ణారెడ్డి (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాదు డీఆర్డీఏ సమీపంలోని అపోలో ఆసుపత్రిలో రామకృష్ణారెడ్డి కన్నుమూసినట్టు ఆయన మేనల్లుడు యోగి వేమన విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు డా. ఎన్.ఈశ్వర రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని రెంటాల చేను గ్రామంలో జన్మించిన రామకృష్ణారెడ్డి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. హిందీ, పూణెలోని డెక్కన్ కాలేజీలో ఎం.ఏ భాషాశాస్త్రం చదివారు. ఆ...