Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2025, 9:41 pm Posted by : ramakrishna

పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ : ఎలాంటి నోటీస్ లు లేకుండా శంషాబాద్ ఎయిర్పోర్టు లో ఎమ్మెల్యే  పాడి కౌశక్ రెడ్డిని అరెస్ట్ చేసిన తీరు ఆక్షేపనీయం, అప్రజాస్వామికమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బతుకమ్మ తో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజా పాలన కాదని, రాచరిక పాలన,నియంత పాలన,ఎమర్జెన్సీ పాలన అని ఏద్దేవా చేశారు.ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నింస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారని, రేవంత్ రెడ్డి కి బీయర్ యస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడంలో ఉన్న  శ్రద్ధ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో లేదన్నారు. అక్రమ కేసులతో అరెస్ట్ లు చేసి మా స్థైర్యాన్ని దెబ్బ తీయలేరని,మమ్మల్ని భయపెట్టలేరని అన్నారు. ప్రభుత్వం అక్రమ కేసులు ఎన్ని పెట్టిన ధైర్యంగా ఎదుర్కొంటామని, కోర్టులపై మాకు పూర్తి విశ్వాసము ఉందన్నారు.రేవంత్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామన్నారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.