Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 7:44 pm Posted by : ramakrishna

సీతారాంపల్లెలో భక్తులతో వరి నాట్లు

 

. . . గురుభక్తిని చాటుకున్న గోవింద గిరి స్వామి శిష్యులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమానికి చెందిన సీతారాంపల్లె వ్యవసాయ క్షేత్రంలో సోమవారం భక్తులు వరి నాట్లు వేసి గురుభక్తిని చాటుకున్నారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన శ్రీ వేంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో గోవింద గిరి స్వామి శిష్యులు, భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని వ్యవసాయ పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ, వ్యక్తిగత పనులను పక్కనపెట్టి సేవాభావంతో ఆశ్రమ వ్యవసాయ క్షేత్రంలో వరి నాట్లు వేయడం ద్వారా భక్తులు గురువుపై తమ అంకితభావాన్ని చాటుకున్నారని అన్నారు. సేవా దృక్పథంతో చేసే ప్రతి కార్యం ఆధ్యాత్మిక సాధనలో భాగమేనని పేర్కొన్నారు. గోవింద గిరి స్వామి, జగన్మాత ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉంటాయని ఆశీర్వదించిన రాఘవేంద్ర స్వామి, అనంతరం వరి నాట్ల కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు జ్ఞాపికలు అందజేసి లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెండె పద్మిని – మహేందర్ దంపతులు, కుంట సువర్ణ, వెంకటాపూర్ మల్లవ్వ, ఆలయ కమిటీ సభ్యులు, భక్త సేవకులు తదితరులు పాల్గొన్నారు.