Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 7:20 pm Posted by : ramakrishna

దొడ్డు వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తరలించాలి

  • అదనపు తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చెయ్యాలి
  • ఏఐయుకెఎస్ స్టేట్ ప్రెసిడెంట్ వి.ప్రభాకర్

 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండల పరిధిలోని తాళ్లపల్లి,  గంగరాయి, కొత్తపల్లి, రహత్ నగర్, దేవక్కపేట్, కారేపల్లి జిపి ల పరిధిలో సుమారుగా 100 లారీలకు పైగా వేలాది టన్నుల క్వింటాళ్ల  దొడ్డు వరి దాన్యం రోడ్లపై ఉన్న వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపధికాన తరలించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం. (ఏ ఐ యు కె ఎస్) ప్రతినిధి బృందం. రాష్ట్ర అధ్యక్షులు. వి. ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని తాళ్లపల్లి, గంగారాయి, కొత్త తాండ, రహత్ నగర్, దేవక్కాపేట్, కారేపల్లి, పాత తాండ ల్లో కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసి గొనె సంచుల్లోనింపి రోడ్డు పై పడేసి ఉంచిన దొడ్డు వరి ధాన్యం బస్తాలను ఏ ఐ యు కె ఎస్ ప్రతినిధి బృందం పరిశీలించారు. అనంతరం స్టేట్ ప్రెసిడెంట్ మీడియా తో మాట్లాడుతూ సుమారు 100 లారీల దాన్యమంతా కూడా దొడ్డు ధాన్యం కావడంతో ఆ ధాన్యాన్ని దించుకోవడానికి రైస్ మిల్ యజమానులు సస్సేమీరా అంగీకరించడం లేదన్నారు. దాంతో రైతులు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గింజ లేకుండా రైతుకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తరుగు సమస్యని ఉత్పన్నం కాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అట్టహాసంగా సీ. ఎం రేవంత్ రెడ్డి   ప్రకటనలు చేస్తూనే ఉన్నారు అని అన్నారు. క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా కొనుగోలు కేంద్రలను నిర్వహిస్తున్న సహకార సంఘాల సీఈఓ లు, ఐకెపి సిబ్బంది రైస్ మిల్ యజమాలతో కుమ్ముక్కై రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై ఉన్న ధాన్యాన్ని తక్షణమే ఖాళీ చేయించాలని,, తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసి గిరిజన తండాలకు చెందిన ధాన్యం తడిసి ముద్దైతే రైతులు నిండా మునుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద 40 కిలోల సంచికి 1./12కిలోన అదనంగా తరుగు తీసుకుంటుండగా రైస్ మిల్ వద్దకు వెళ్ళిన తర్వాత దాన్యం బాగాలేదని, దొడ్డు ధాన్యం మాకు అవసరం లేదని రైస్ మిల్ యజమానులు మొండికి వేయడంతో సెటిల్మెంట్ పేరుతో రైతులకు సంబంధం లేకుండానే 40 కిలోల సంచికి 1.1/2నకిలోఅదనంగా క్వింటాలకు ఐదుకిలోపైగా తరుగు తీసుకుంటూనే దించుకుంటున్నారని, దీనిపై తగు చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,  ఈ విషయమై కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా అన్ని పంటలకు క్వింటాలకు రూ. 500  బోనస్ ఇస్తామని ప్రకటించి రైతులకు మోసం చేశారని అన్నారు. రైతుల నుంచి సెటిల్మెంట్ పేరుతో తరుగు ఐదు కిలోలు అదనంగా ఇప్పించే సీఈఓ,ఐ కె పీ అధికారులపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం. (ఏ ఐయు కె ఎస్) రాష్ట్ర కార్యదర్శి దేవరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న, జిల్లా కార్యదర్శి. బి. కిషన్,  సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు.కె.రాజేశ్వర్, జీలకర్ర నడిపెన్న, ఎం. నరేందర్, పీడీఎస్ యు నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త డిస్ట్రిక్ట్ కమిటీ తదితరులు పాల్గొన్నారు.