Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2025, 1:57 pm Posted by : ramakrishna

ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో 10వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఖత్ గాం, శెట్లూర్, హస్గుల్, పెద్ద దేవాడ, పెద్ద దడిగి, మాన్యాపూర్, మాన్యాపూర్ 2, రాజాపూర్, వాజీద్ నగర్, బండా రెంజల్ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం లో మహిళా సంఘాల సభ్యులు, మండల వ్యవసాయ అధికారి, ఏపీఎం, సీసీ లు, ఏఈఓలు, జీపీ సెక్రటరీలు, జీపీఓలు, వీఓఏలు, గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Paddy purchase centers launched under the auspices of IKP