ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కమ్మర్ పల్లీ, బతుకమ్మ: కమ్మర్ పల్లి మండల పరిధిలోని కొత్తచెరువు తాండ, కోనాపూర్,కోనసమందర్, బషీరాబాద్ గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జి,ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య  పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ,రైతులు పండించిన ధాన్యాన్ని మధ్యవర్తులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి లేదా సొసైటీ వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం అమ్మితేనే రైతులకు పూర్తి లాభం దక్కుతుందని ఆయన చెప్పారు....