Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 7:50 pm Posted by : ramakrishna

ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కమ్మర్ పల్లీ, బతుకమ్మ: కమ్మర్ పల్లి మండల పరిధిలోని కొత్తచెరువు తాండ, కోనాపూర్,కోనసమందర్, బషీరాబాద్ గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జి,ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య  పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ,రైతులు పండించిన ధాన్యాన్ని మధ్యవర్తులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి లేదా సొసైటీ వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం అమ్మితేనే రైతులకు పూర్తి లాభం దక్కుతుందని ఆయన చెప్పారు. ఈ సీజన్‌కు మంచి వరి ధాన్యానికి ఏ-గ్రేడ్ వరికి ₹2,389, బి-గ్రేడ్ వరికి ₹2,369 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తాసిల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ,వరి కొనుగోలు కేంద్రాల్లో ఐకెపి ఇన్‌చార్జ్‌లు రైతుల పేర్లు రిజిస్టర్‌లో సీరియల్ గా  నమోదు చేసి, క్రమపద్ధతిలో వడ్లు కాంట  వేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు,విశ్రాంతి వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుచ్చన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నోల్లా రెడ్డి,ఐకెపి ఏపీఎం,కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ,సీసీలు రవి, పీరియా,భాగ్య,వివోఏ,లు గంగాధర్, గణేష్,నయన,రైతులు ఐకెపి డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Paddy purchase centers launched under the auspices of IKP