జిల్లాలో వరి ధాన్యం సేకరణ ఏర్పాట్లు భేష్

అభినందించిన స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి కలెక్టర్ తో కలిసి కొనుగోలు కేంద్రాల పరిశీలన   నిజామాబాద్, బతుకమ్మ : ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం సేకరణ కోసం నిజామాబాద్ జిల్లాలో ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేశారని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ అయిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిణి లక్ష్మి అభినందించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ లతో కలిసి బుధవారం ఆమె ఎడపల్లి మండల కేంద్రంలో ఐ.కె.పీ, సహకార...