ఇందూరు తిరుమల వ్యవసాయ క్షేత్రంలో మొదలైన వరి కోతలు
మోపాల్, బతుకమ్మ : ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నరసింగపల్లి ఆలయంలో ప్రాంగణంలో గల వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం వరి కోతలు మొదలయ్యాయి. పొలం మైసమ్మకు ముందుగా పూజలు చేసి ఆ తర్వాత అన్నపూర్ణా మాతకు పూజ చేసి ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీవారు నరసింహారెడ్డి వరి కోతలను ప్రారంభించారు. పంటలు మంచిగా పండి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహ రెడ్డి ప్రార్థించారు.