వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మండలం దేశాయ్ పేట్ సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదని, రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్న సన్నం రకం ధాన్యానికి ప్రోత్సహకంగా క్వింటాలుకు 500/- బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు....