Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2024, 4:19 pm Posted by : ramakrishna

సీడ్ కం పట్టి డ్రిల్ తో వరి సాగు

బతుకమ్మ,మోర్తాడ్: తక్కువ నీటితో వరి సాగు చేసే విధానాన్ని ముఖ్యంగా ఎరువు, విత్తనాలు ఒకేసారి వేసుకునే సీడ్ కం పట్టి డ్రిల్ యంత్రంతో పొడి భూమిలో వరి పండించడం వల్ల సుమారు 15 నుండి 20 శాతం నీటిని ఆదా చేయవచ్చని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ జిల్లా ఏరియా మేనేజర్ ఎర్ర లహరి అన్నారు. గురువారం మూర్తుల మండల కేంద్రంలో వరి పంటలు పరిశీలిస్తూ రైతులకు అవగాహన కల్పించారు. ఈ విధానంలో వరి సాగు చేస్తే కూలీల కొరతను అధిగమించవచ్చని  అంతే కాకుండా ఈ విధానం వల్ల నెల రోజుల సమయం ఆదా అవ్వడమే కాకుండా ఎకరాకు కేవలం 12 కేజీల విత్తనాలు సరిపోతాయని పేర్కొన్నారు. వరుసలో విత్తనాలు వేయడం వల్ల చేనుకు గాలి, వెలుతురు బాగా తగిలి వాటి వలన చీడ పీడల సమస్య కూడా తగ్గుతుంది తెలిపారు. కార్యక్రమంలో సీఎఫ్ సన్నుత్న, తరుణ్, రైతులు నిమ్మ రాజేశ్వర్, రమేష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Paddy Cultivation with Seed Com Patti Drill