Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 8:57 pm Posted by : ramakrishna

ఘనంగా పడకంటి రాము పుట్టినరోజు వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యువ వ్యాపారవేత్త సమాజ సేవకుడు పొలిటికల్ అనలిస్ట్ ప్రజా సమస్యలపై పోరాడే స్వచ్చంద న్యూస్ ఛానెల్స్ నిర్వహించే పడకంటి రాము పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లో రెండు వందల మంది యాచకులకు, కూలీ పని చేసుకునే నిరుపేదలకు భోజనం, వాటర్ పాకెట్, అరటి పళ్ళు  పంపిణీ చేశారు. ఇదే విధంగా రామును అభిమానించే ఎంతో మంది అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో అన్నదానం, బ్లడ్ డొనేషన్,స్టేషనరీ కిట్స్ పంపిణీ,వన్యప్రాణులకు ఆహారం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు స్వచ్చందంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన స్వచ్ఛంద సేవా సంస్థ లివ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేషన్ పేరును పడకంటి రాము ఫౌండేషన్ పేరుగా మార్చినట్లు విలేకరుల సమావేశంలో తెలియచేశారు.

Padakanti Ramu's birthday celebrations in grand style