Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 March 2025, 4:39 pm Posted by : ramakrishna

పడకంటి రాము సేవలకు ప్రముఖ అమెరికా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ కు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు అయిన పడకంటి రాము గత 15సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా చేస్తున్న ఎన్నో రకాల నిస్వార్థ సేవాకార్యక్రమాల్ని గుర్తించిన అమెరికా కు సంబంధించిన ప్రముఖ యూనివర్సిటీ లలో ఒకటైన జార్జియా యూనివర్సిటీ శుక్రవారం ఆగ్రా లోని రాడిస్సాన్ హోటల్ లో జరిగిన కాన్వొకేషన్ ప్రోగ్రాం లో గౌరవ డాక్టరేట్ ను అందించారు. ఈ కార్యక్రమానికి రాము తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరు అయి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా రాము మీడియా తో మాట్లాడుతూ తను చేసిన సమాజ సేవల్ని గుర్తించి అత్యున్నత డాక్టరేట్ పట్టాను అందించిన యూనివర్సిటీ కి, తన సేవల్ని ప్రోత్సహిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అభిమానులు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Padakanti Ramu receives honorary doctorate from prestigious American university for his services