సీఎం, పిసిసి  చిత్రపటాలకు పాలాభిషేకం

నందిపేట్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో డోంకేశ్వర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పి సి సి  అధ్యక్షుడు మహేశ్ గౌడ్ చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సెల్ అధ్యక్షుడు గణేశ్ గౌడ్ మాట్లాడుతూ, ఎన్నికల హామీలను వరుసగా నెరవేర్చుతున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం రాష్ట్రంలోని బీసీ వర్గాలకు చారిత్రక విజయం...