Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 June 2025, 11:33 am Posted by : ramakrishna

ఎమ్మెల్యే ఇంట్లో పీఏ ఆత్మహత్య

యాదగిరి గుట్ట, బతుకమ్మ  : ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఐలయ్య ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడిని ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తిగత పనులు (పీఏ) చేసే గంధమల్ల రవి గా గుర్తించారు. కాగా రవి యాదగరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో పెంట హౌజ్ లో ఉంటున్నాడు. రవి రెండు రోజులు క్రితం సొంత గ్రామమైన సైదాపూర్ వెళ్లి శుక్రవారం వచ్చి ఎమ్మెల్యే నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా రవి మృతిపై  సైదాపూర్ గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.