ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడ్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం రాత్రి బస చేశారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్,  విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ కె.సురేందర్ ను  అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్...