Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2025, 9:46 pm Posted by : ramakrishna

గురుకుల పాఠశాలలో కలెక్టర్  రాత్రి బస

  • సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యనే ప్రధాన మార్గం

 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం రాత్రి బస చేశారు. విద్యార్థులకు భోజన వసతి సదుపాయాలు, విద్య బోధన, రోజువారి దినచర్య, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్  లో ఉన్న విద్యార్థుల తరగతి గదికి కలెక్టర్ వారితో భేటీ అయి 10వ తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. కిచెన్ రూమ్, డైనింగ్ హాల్ ,స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన వంట సరుకులను నాణ్యత  పరిమాణాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేసి విద్యార్థులతో పాఠశాల గదిలో నిద్రించారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ శివప్రసాద్ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ఉపాధ్యాయులు ఉన్నారు.