పొంగిపొర్లుతున్న చెక్ డ్యాంలు

మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలోని పెద్దవాగులో గాండ్లపేట్, ధర్మోరా గ్రామాల్లో నిర్మించిన చెక్ డ్యాములు జిలకర సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో నుంచి వరద ప్రవాహం రావడంతో చెక్ డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలు జలదృశ్యాలను చూడడానికి అందాలను తిలకించడానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. ధర్మోరా పాలెం గ్రామాల మధ్య నిర్మించిన చెక్ డ్యామ్ నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఎవరు రావద్దని గ్రామస్తులు తెలియజేశారు.