. సివిల్ సప్లై శాఖలో వింత పరిస్థితి
హైదరాబాద్, బతుకమ్మ: సివిల్ సప్లైశాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న కొందరు రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం మార్చి 31వ తేదీ వరకు విధులు నిర్వర్తించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు రానవసరం లేదు. ఈ మేరకు మేనేజింగ్ డైరెక్టర్ డీఎస్ చౌహాన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అయినప్పటికీ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్ మెంట్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో విధులు నిర్వర్తించిన 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు అవుట్ ఆయా జిల్లాలతోపాటు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఉన్నత స్థాయి అధికారుల ఉత్తర్వులను ఏ మాత్రం పట్టించుకోడం లేదు. వయస్సు మీద పడిన వారు విధులు నిర్వర్తించడం కష్టమని ప్రభుత్వం ఉద్యోగ విరమణ ఇస్తే, మళ్లీ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదిక తిష్ట వేయడంతో నిరుద్యోగ యువతకు అవకాశాలు లేకుండా పోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
రిటైర్డ్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఇంకా విధులు నిర్వర్తిస్తుండడంతో ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదని, అలాంటి వారి కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని సివిల్ సప్లై శాఖలో పనిచేసే పలువురు ఉద్యోగస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా వారిని పూర్తిగా తొలగించి నూతన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని అంటున్నారు. అయినను ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను లెక్కలోకి తీసుకొని రిటైర్డ్ ఉద్యోగస్తులకు సహకరిస్తున్న పలువురు ఉద్యోగస్తులు తొలగించి నూతన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.