Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 8:09 pm Posted by : ramakrishna

నల్ల బ్యాడ్జీలతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు తెలంగాణ వెల్నెస్ సెంటర్స్ ఉద్యోగులు నల్ల  బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి ఏజెన్సీలను రద్దుపరిచి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించడం గాని లేదా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పరిచి దాని ద్వారా జీతాలు అందించాలని అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.  మిగతా ఉద్యోగులను వీలైనంత త్వరగా రెగ్యులరైజ్ చేయడం గాని లేదా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తూ వారికి ఉద్యోగ, ఆరోగ్య భద్రతను కల్పించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వెల్నెస్ సెంటర్ లో పనిచేస్తున్న డాక్టర్లు, ఫార్మసీస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్ లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు,సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.