Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 4:10 pm Posted by : ramakrishna

ధర్మారం లొ  పోలీసుల తీరుపై ఆగ్రహం

 

. . . పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన

. . . ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిచ్ పల్లి మండలం ధర్మారం ( బి) పోలింగ్ కేంద్రం పోలీసులు అధికార పార్టి అభ్యర్థి వైపు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అని పోలింగ్ కేంద్రం ఎదుట ప్రజలు బైఠాయించి నిరసన తెలిపారు. ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత 11 గంటల ప్రాంతంలో అధికార పార్టీ బలపరిచిన సాయిబాబా పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని, ప్రత్యర్థి అభ్యర్థి వాసు ఆరోపించారు . పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి వెళ్లి ప్రచారం చేయడమే కాకుండా ఓట్లు వేయండని ఒత్తిడి తెస్తున్నారు బిజెపి నాయకులు మండిపడ్డారు.

Outrage over police conduct in Dharmaram

పోలీసులు ఉన్న ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అని కార్యకర్తలు, స్థానికులు లోనికి దూసుకు వచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది. దీనితో పోలింగ్ ప్రక్రియ కు అంతరాయం ఏర్పడింది. ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బిజెపి నాయకులు రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దానితో పోలీస్ అధికారులు అదనపు బలగాలను రప్పించి అందరిని చెదరగొట్టారు. దర్మారం గ్రామంలో  ఉద్రిక్తత పరిస్థితి విషయం తెలిసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.