Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2024, 3:07 pm Posted by : ramakrishna

గోవును పూజించే సంస్కృతి మనది

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కేవలం భారతదేశంలోనే గోవులను పూజించే మహోన్నతమైన సంస్కృతి మనదని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా అన్నారు. గోపాల్ బాగ్ గోశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాష్టమి మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అడిసినల్ కలెక్టర్ కిరణ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా వెంకట్ రెడ్డి, గోపాల్ బాగ్ గోశాల కమిటీ అధ్యక్షుడు కోలా రామ్, కార్యదర్శి మాస్టర్ శంకర్, కమల్ ఇనాని, కోశాధికారి ధన్ పాల్ శ్రీనివాస్, ట్రస్టీ  కైలాస్ బోయంకర్ తదితరులు పాల్గొన్నారు.

Ours is a cow worshiping culture