మన తెలంగాణ భాష మనకు గర్వకారణం
తెలంగాణ భాష లో మరింత విస్తృతంగా సాహిత్య సృజన జరగాలి తెలంగాణ భాషలో కవితలు, కథల పోటీల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, బతుకమ్మ : మన తెలంగాణ భాష మనకు గర్వకారణమని, తెలంగాణ భాషను ముందు తరాలకు అందించడం మన ధ్యేయం కావాలని గౌరవ శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాదులోని తన నివాసంలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ భాషలో కవితలు మరియు కథల పోటీలకు సంబంధించిన పోస్టర్...