Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 7:57 pm Posted by : ramakrishna

న్యాయవాదుల సొసైటీ ఆర్థిక బలోపేతమే మా ద్యేయం

 

. . . నూతన అధ్యక్ష, కార్యదర్శులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల సహకార పరపతి సొసైటీ లిమిటెడ్ ఆర్థికంగా మరింత పరిపుష్టి కావడానికి కృషి చేస్తామని సొసైటీ నూతన అధ్యక్షుడు చింతకుంట సాయిరెడ్డి, కార్యదర్శి పడిగల వెంకటేశ్వర్ తెలిపారు. నూతనంగా అధ్యక్షుడు, కార్యదర్శి లుగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా సీనియర్ న్యాయవాదులు జి. వి కృపాకర్ రెడ్డి, శ్రీహరి ఆచార్య, రాజ్ కుమార్ సుభేదార్, తోట శ్రీనివాస్, మద్దెపల్లి శంకర్ తదితరులు పూలగుచ్చం శాలువాతో సన్మానించిన వేళ వారు మాట్లాడారు. ఆర్థిక సంస్థను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్ళడానికి సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలు స్వీకరించి మరిన్ని ప్రగతి పథకాలకు శ్రీకారం చుడతామని అన్నారు. సొసైటీ అనేది న్యాయవాదులందరి కష్టార్జితంతో నిర్మితమైనదని మేము ఎక్కువ కష్టపడి, శ్రమించి సొసైటీని ఆర్థిక బలోపేతానికి తీసుకుని వెళతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జగన్ గౌడ్, సురేష్ మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.