జీవన శైలి వ్యాధులను నియంత్రించడమే మన లక్ష్యం
. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జీవనశైలి వ్యాధులను నియంత్రించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని అసంక్రమిత వ్యాధుల నియంత్రణ విభాగం ద్వారా జీవన శైలి వ్యాధుల నిర్ధారణ, చికిత్స, ఆన్ లైన్ ఎంట్రీ అంశాలపై సిహెచ్ సి లలో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు డిఎంహెచ్ఓ ఛాంబర్ లో శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ...