Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2025, 6:49 pm Posted by : ramakrishna

విద్యార్థుల సర్వతోముకాభివృద్ధి మా లక్ష్యం

బతుకమ్మ,మోర్తాడ్: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడమే మా పాఠశాల ఏకైక లక్ష్యమని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్ అన్నారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, రెండు ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ క్లాస్ విద్యాబోధన, విద్యార్థులకు నెలనెలా వైద్య పరీక్షలు, ఆటల పై ప్రత్యేక శిక్షణ, కరాటే, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని దొనకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటింటికి వెళ్లడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్, గంగామణి, మధు, రఘునాథ్, సిఆర్పి పరిమళ తదితరులు పాల్గొన్నారు.