. . . కవిత పార్టీపై సెటైర్లు
హైదరాబాద్, బతుకమ్మ :
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సెటైర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్రంలో అసలైన పార్టీ తమదేనని బీఆర్ఎస్ పరోక్షంగా చెబుతుంది. కోల్గేట్, బిస్లరీ వాటర్ బాటిల్ ఒర్జినల్, ఫేక్ ప్రోడక్ట్స్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తుంది. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ సైతం కవిత పార్టీపై ఎటాక్ ప్రారంభించింది. బీఆర్ఎస్ తోక పార్టీనే కవితక్క ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సేన అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన తలా తోక ఎప్పటికి ఒక్కటే. బాపు బీఆర్ఎస్ అంతర్భాగమే తన టీఆర్ఎస్ అంతా గ్యాస్ అంటూ సెటైర్ వేశారు. కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీపై సెటైర్లతో సోషల్ మీడియాలో మార్మోగుతుంది.