జి.జి కాలేజ్ లో లైఫ్ సైన్స్ & ఫిజికల్ సైన్స్ విద్యార్థులకు ఓరియెంటేషన్

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) అకాడమిక్ సెల్ ఆధ్వర్యంలో శనివారం లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, విద్యార్థులకు,  ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బి.ఎఫ్.ఎస్.ఐ., హెల్త్ కేర్ మేనేజ్మెంట్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వంటి కొత్త కోర్సులు మన కళాశాలలో ఉన్నాయని, భవిష్యత్తులో ఇటువంటి నైపుణ్యాభివృద్ధితో ముడిపడిన కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అకాడమిక్ కార్యకలాపాలతో పాటు అప్రెంటిషిప్ కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొనాలని, కళాశాల సౌకర్యాలు ఉపయోగించుకొని తమ...