జి.జి. కళాశాలలో జూనియర్ లకు ఓరియంటేషన్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) అకాడమిక్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం బి.ఏ., బీకాం, బి.బి.ఏ., బి.ఎఫ్.ఎస్.ఐ. కోర్సుల్లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో అందుబాటులో ఉన్న విద్యా, మౌలిక వసతులు, ఉత్తమ ఫలితాల సంప్రదాయం, అకాడమిక్ కార్యకలాపాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు కళాశాల అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని...