Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 7:09 pm Posted by : ramakrishna

ఏర్గట్ల పాఠశాలలో  రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

 బతుకమ్మ,ఏర్గట్ల:       రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారత రాజ్యాంగం దినోత్సవ వేడుకలను ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వం,తో కూడిన భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని భారతదేశ జాతీయ సమైక్యతను అందరు కాపాడాలని ముఖ్యంగా విద్యార్థులు చక్కగా చదువుకొని, ఉన్నత స్థానంలో నిలబడి ఈ దేశ గౌరవాన్ని కాపాడినాడే నిజమైన రాజ్యాంగాన్ని కాపాడినట్లు అవుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి తెలిపాడు.ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం,చిత్రలేఖనం పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దిన్, ప్రసాద్,విజయ్ కుమార్, ప్రవీణ్ శర్మ, శ్రీనివాస్, గంగాధర్,రాజ నరసయ్య, రాజశేఖర్ గంగామోహన్, నరేష్, ట్వింకిల్,జ్యోతి,సబిత,సమత, విద్యార్థులు పాల్గొన్నారు.