నిజామాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్
పెరగనున్న ఉష్టోగ్రతలు హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంటే మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈజిల్లాల్లో 41 నుంచి 42 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.