Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 9:51 am Posted by : ramakrishna

తెలంగాణ లో రాజ్యధికారం కోసం అణగారిన వర్గాలు ఏకం కావాలి

 

. . .  ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ విశారాధన్ మహారాజ్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ లో అత్యధికంగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ లు ఏకమైతే రాజ్యధికారం సాధించచ్చని ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్, మాదిగ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు విశారాధన్ మహారాజ్ అన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరం లో మాదిగ మహారాజుల శోభ యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరయినా విశారాధన్ మహారాజ్ మాట్లాడుతూ… ఒకప్పుడు జంబూద్వీపం ను ఏలింది మాదిగలు అన్నారు. ఆనాడు కుట్రలు చేసి మాదిగలను యుద్ధం లో ఓడించి బానిసలు గా అంటారని వారీగా మార్చారు అన్నారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం అన్నారు. మాదిగలు రాజ్యాధికారం దిశగా అంబేద్కర్, ఫూలే, కాన్షిరాం ఆలోచన విధానం తో కృషి చేయాలి అన్నారు. రాష్ట్రం లో మాదిగ ల జనాభా 12 శాతం ఉండగా 10 శాతం గా చూపి అన్యాయం చేసారు ఆరోపించారు. దేశం లో మాదిగలు, వారి ఉపకులాలలు 26 కోట్లు అని సంత్ కభీర్ దాస్, సంత్ రవి దాస్, గురు నానాక్ ఆలోచనలు అయినా అంత సమానం అనే ఆశయం సాధనకు కృషి చేద్దాం అని పిలుపు ను ఇచ్చారు. అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చిందని దాని ద్వారా సంక్రమించిన హక్కు లతో రాజ్యాధికారం సాధిద్దాం అని విశారాధన్ మహారాజ్ పిలుపు ను ఇచ్చారు.

Oppressed sections must unite to attain state power in Telangana.

.  .  . అట్టహాసంగా మాదిగ ల శోభ యాత్ర

మాదిగ మహారాజ్ ల శోభ యాత్ర నగరం లో అట్ట హాసంగా జరిగింది. నగరం లో బోర్గం నుంచి వినాయక నగర్, ఫూలాంగ్, ప్రగతి నగర్, కోర్ట్ చౌరస్తా మీదుగా ధర్నా చౌక్ వరకు సాగింది. సంత్ రవిధాస్, సంత్ కభీర్ ల ఫోటోలను రథం లపై ఊరేగించారు. మాదిగ జాగృతి వ్యవస్థపాక అధ్యక్షులు విశారాధన్ మహారాజ్ రాజ్యాంగం ను చేత ధరించి శోభ యాత్రలో పాల్గొన్నారు. దప్పుల దరువులు, కోలాటం మధ్య శోభ యాత్ర జరిగింది. ఈ శోభ యాత్రలో రాష్ట్ర కార్యదర్శి సంతోష్, ఉపాధ్యక్షులు నాగేశ్వర్ రావు, జిల్లా అధ్యక్షులు సరికేలా రమేష్, సుమన్ , మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Oppressed sections must unite to attain state power in Telangana.