పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన
డిల్లీ, బతుకమ్మ : పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన తెలిపాయి. బీహార్ లో అమలు చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చకు లోకసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.