దోస్త్ ద్వారా కోర్సు మార్చుకునే అవకాశం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దోస్త్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు తాము చేరిన కాలేజీలో కోర్సు మార్చుకోవడానికి ఇంట్ర కాలేజీ ఫేజ్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైందని తెలంగాణ యూనివర్సిటీ దోస్త్ సమన్వయ కర్త డాక్టర్.వాసం.చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 నుండి 13 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపారు. ఈ వెసులుబాటు తెలంగాణ విశ్వవిద్యాలయం లోని 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులలో ప్రవేశం పొందిన విద్యార్ధులకు...