నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దోస్త్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు తాము చేరిన కాలేజీలో కోర్సు మార్చుకోవడానికి ఇంట్ర కాలేజీ ఫేజ్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైందని తెలంగాణ యూనివర్సిటీ దోస్త్ సమన్వయ కర్త డాక్టర్.వాసం.చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 నుండి 13 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపారు. ఈ వెసులుబాటు తెలంగాణ విశ్వవిద్యాలయం లోని 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులలో ప్రవేశం పొందిన విద్యార్ధులకు కూడా వర్తిస్తుందని అన్నారు. అయితే విద్యార్థులు కోరుకున్న కోర్సులో సీట్లు ఖాళీగా ఉంటేనే ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారని, ఒకవేళ ఇంట్ర కాలేజీ ఫేజ్ లో కొత్త కోర్సు రాకపోతే, ప్రస్తుతం ఉన్న సీటు అలాగే ఉంటుందని ఆయన తెలిపారు.