డిగ్రీతో పాటు జాబ్ ఆఫర్ లెటర్‌కు అవకాశం

  . . . గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఏఈడీపీ ప్రత్యేక కోర్సులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విద్యార్థులకు డిగ్రీ విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టిన అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కోర్సులను నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. కళాశాలలో బీకాం విభాగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బిఎఫ్ఎస్ఐ), సైన్స్ విభాగంలో...