Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 8:47 pm Posted by : ramakrishna

జీపీవో ప్రమోషన్ లలో రికార్డు అసిస్టెంట్ లకు కూడా అవకాశాలు కల్పించాలి

 

. . . రికార్డు అసిస్టెంట్ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు రవీందర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

తెలంగాణ ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ స్కేలు జీతం పొందుతున్న జీపీవో లకు మాత్రమే ప్రమోషన్లు కల్పిస్తూ జీవో 74ను జారీ చేసింది. అయితే ఈ జీవో లో సవరణ ఆమెండమెంట్ చేసి, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఒ ఎస్ పదవుల నుండి జీపీవో లుగా విధులు నిర్వహిస్తున్న వారికి కూడా ప్రమోషన్లలో సమాన అవకాశాలు కల్పించాలని రికార్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర అధ్యక్షులు మెట్టు రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఉద్యోగుల న్యాయమైన హక్కు కాబట్టి, ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. జిపిఓలకు తమ సొంత నియోజకవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గంలో డ్యూటీ చేయాలని ఉన్న నిబంధన వల్ల అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి పక్కా మండలంలో అందుబాటులో ఉన్న మండలాలలో ఉద్యోగాలు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ గోడును విని తమకు న్యాయం చేయాలని కోరారు.